The Central Board of Secondary Education (CBSE) బోర్డు 10 మరియు 12 తరగతి విద్యార్థుల పరీక్షా తేదీలను (CBSE Date Sheet 2024) ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారం గురువారం, ఫిబ్రవరి 15 2024 నుంచి బుధవారం, మార్చ్ 13 వరకు 10 వ తరగతి మరియు గురువారం, ఏప్రిల్ 02 వరకు 12 వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించబడతాయి. పై రెండు తరగతుల విద్యార్థులు పరీక్షలు సరైన విధంగా రాయడానికి, ప్రతి రెండు పరీక్షల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వబడింది అని పరీక్షల నియంత్రణాధికారి Dr. Sanyam Bharadwaj తమ ప్రకటనలో తెలియజేశారు. అంతేకాక, 12 వ తరగతి విద్యార్థులు హాజరు అయ్యే అని పోటీ పరీక్షల తేదీలు (JEE Main తో సహా ) దృష్టిలో ఉంచుకుని తేదీలు ఖరారు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు బాగా సిద్ధం కావడానికి CBSE Date Sheet 2024 చాలా ముందుగానే జారీ చేశామని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు.
సీబీసీ సర్కులర్ కాపీ; 10 వ తరగతి విద్యార్థుల డేట్ షీట్ (date sheet 2024 class 10 pdf download) మరియు 12 వ తరగతి విద్యార్థుల డేట్ షీట్ (cbse date sheet 2024 class 12 pdf download), కోసం cbse official website క్లిక్ చెయ్యండి.