ఈ రోజు జరిగిన తమ పార్టీ సమావేశంలో శ్రీ భజన్‌లాల్ శర్మ (Bhajanlal Sharma) ను ముఖ్య మంత్రి గా (Rajasthan CM Bhajanlal Sharma) భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎన్నుకుంది. దియా కుమారి (జైపూర్ చివరి పాలక మహారాజా మాన్ సింగ్ II మనవరాలు) మరియు ప్రేమ్‌చంద్ బైర్వా డీ లు ఉపముఖ్య మంత్రులు గా ఎన్నుకోబడ్డారు. నవంబర్ లో రాజస్థాన్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 115 స్థానాల్లో విజయం సాధించింది. రాజస్థాన్ అసెంబ్లీ తదుపరి స్పీకర్‌గా వాసుదేవ్ దేవాని ఎంపికయ్యారు. తాము ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని తెలపడానికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతలు గవర్నర్ శ్రీ కల్‌రాజ్ మిశ్రాను కలిశారు.