ఎగ్జిట్ పోల్ 2023 (Exit Poll 2023) జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) ఎన్నికలను స్వీప్ చేస్తుందని వేసిన అంచనా నిజం అయ్యింది. ఈ రోజు విదుదల అయిన మిజోరాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం (Mizoram Assembly Elections 2023), అధికార అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 10 సీట్ల కే పరిమితం అవ్వగా, బీజేపీ – 2 సీట్లు మరియు కాంగ్రెస్ – 1 సీట్ కైవసం చేసుకున్నాయి.
40 స్థానాలు ఉన్న మిజోరాం అసెంబ్లీ కి 27 స్థానాలను గెలవడం ద్వారా, Zoram People’s Movement (ZPM) పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది. లాల్ దుహామా (ZPM అధ్యక్షుడు) సారధ్యం లో ప్రభుత్వం కొలువుతీరబోతోంది.