ఉత్కంఠతకు తెర పడింది. PCC అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ ని ఒంటి చేత్తో అధికారానికి తీసుకుని వచ్చిన శ్రీ అనుముల రేవంత్ రెడ్డి ని (Telangana CM Revanth Reddy ) కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఖరారు చేసింది. ఈ రోజు ఆ AICC ప్రధాన కార్యదర్శి శ్రీ వేణు గోపాల్ ఢిల్లీ లో ప్రకటించారు. ఈ నెల 7 వ తేదీన, రేవంత్ రెడ్డి (Revanth Reddy ) రెండవ ముఖ్య మంత్రి గా LB స్టేడియం లో ప్రమాణ స్వీకారం చేస్తారు.
అధిష్టానం పిలుపు మేరకు రేవంత్ రెడ్డి (Revanth Reddy ) ఢిల్లీ వెళ్లారు. అధికార వాహనాలతో, ప్రోటోకాల్ బృందం ఢిల్లీ విమానాశ్రయం లో ముఖ్య మంత్రి కోసం వేచి చూస్తున్నారు.