వర్క్ ఫ్రమ్ హోమ్ (work from home/remote work) చేసే ఒక ఉద్యోగి భవిష్యత్తులో ఎలా ఉంటాడో AI రూపమిచ్చిన చిత్రం (work from home warning-WFH workers)
కరోనా వైరస్ పరిచయం చేసిన లాక్ డౌన్ ప్రపంచ స్థితిగతులలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. వీటిలో ప్రముఖంగా చెప్పుకో తగింది – వర్క్ ఫ్రమ్ హోమ్ Work From Home (WFM) / Remote Work (RW). రిమోట్ వర్క్ అనేది లాక్ డౌన్ సమయంలో యాజమాన్యాలకు మరియు ఉద్యోగులకు ఉభయతారకం, అనేక కంపెనీలు ఇప్పటికే శాశ్వత మరియు హైబ్రిడ్ పని విధానంలో తమ ఉద్యోగుల సౌకర్యం కోసం అమలు చేస్తున్నాయి. అయితే ప్రతి నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్టు, ఈ క్రొత్త పని విధానం వల్ల ప్రతికూలతలు (work from home warning for WFH workers) కూడా ఉన్నాయి.
రిమోట్ వర్క్ (Remote Worker) చేసే వ్యక్తులు తమ అలవాట్లు మార్చుకోకపోతే ఎలా కనిపిస్తారో, ఆ పని వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యం పై ఏ విధమైన ప్రభావం చూపుతుందో (what are the effects of working from home) క్లినికల్ సైకాలజిస్ట్‌లు మరియు ఫిట్‌నెస్ నిపుణుల బృందంతో పని చేసిన అమెరికా కు చెందిన Job discovery platform, Directly Apply కంపెనీ వారు తెలుసుకున్నారు. ఆ బృందం తాము తెలుసుకున్న విషయాలు ఏఐ (AI) సహాయంతో ఒక దృశ్య రూపం ఇచ్చారు. ఆ దృశ్య రూపానికి వారు ఇచ్చిన పేరు: సుసాన్ (SUSAN)
మంచం నుంచి డెస్క్ వరకు మీరు చేసే ప్రయాణం మీకు మరింత కుటుంబ సమయాన్ని, స్వతంత్రతను ఇస్తే ఇవ్వ వచ్చు. కానీ ఆ సుఖాలు భవిష్యత్తులో మీ మనస్సు మరియు శరీరానికి తద్వారా మీ కుటుంబానికి చేసే చేటు ఏంటో తెలుసా? (what are the effects of working from home)
రిమోట్ వర్కింగ్ వల్ల తలఎత్హే ఆరోగ్య చిక్కులు (work from home warning for wfh employees)
(1) Computer Vision Syndrome: దీని వల్ల కళ్లు ఎర్రగా మారడం, పొడిబారడం, అలసట, కంటి చికాకు & దురద, అస్పష్టమైన దృష్టి (the vision bleak)
(2) Poor Posture: మెడ కండరాలు పట్టేయడం, అక్కడి నుంచి చేతులు మరియు నడుముకి చేరి గూని వీపు కాలక్రమేణా అభివృద్ధి చెందవచ్చు. దీనికి కారణం సరైన శారీరక వ్యాయామం లేకపోవడం మరియు కంప్యూటర్ / లాప్ టాప్ ముందు ఎక్కువ సమయం సరైన భంగిమ లో కూర్చోవక పోవడం లేదా కావలసిన ఎత్తు లేక పోవడం (సోఫా మీద / మంచం మీద కూర్చోవడం)
(3) రోజంతా కీబోర్డ్ కి అంకితం అవ్వడం: రోజులో ఎక్కువ సమయం టైపు చెయ్యడం వల్ల, మణికట్టు దగ్గర ఇబ్బంది, గాయం గా మారి శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఆ ఇబ్బందిని తీసుకుని వెళ్తుంది.
(4) జుట్టు రాలడం (Hair Loss): రోజంతా ఇంట్లో ఉండి పని చేయడం వల్ల (work from home weather warning) శరీరానికి కావలసిన విటమిన్ డి దొరకదు. శరీరానికి తగిన సూర్యరశ్మి తగలక పోవడం వల్ల జుట్టు రాలడం, బట్టతల మీద ప్యాచెస్ రావడం లాంటి ఇబ్బందులు వస్తాయి
(5) డార్క్ సర్కిల్స్ (Dark Circles): రోజులో ఎక్కువ భాగం కంప్యూటర్ / లాప్టాప్ స్క్రీన్ చూస్తూ గడపడం వల్ల, కళ్ల కింది చర్మంలో నల్లటి వలయాలు ఏర్పడి, సరైన జాగ్రత్త తీసుకోకపోతే, కళ్ళు నిస్తేజంగా అవుతాయి
(6) టెక్ నెక్ (Tech Neck): ఫోన్ లేదా లాప్ టాప్ తో పని చేయడం వల్ల మెడ పై అధిక ఒత్తిడి కలిగి అది శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పిని కలిగిస్తుంది. ఫోన్ లేదా లాప్ టాప్ వలన కలిగే నొప్పి కనుక దీనికి టెక్ నెక్ అనే పదాన్ని వాడుతున్నారు. ఈ టెక్ నెక్ వల్ల వెన్ను నొప్పి పెరగడం తద్వారా వస్తువులు వంచడం & ఎత్తడం వంటి పనులు కష్టతరం చేస్తుంది మరియు తిమ్మిరి ఎక్కడం, కదలడం కష్టంగా ఉండటం, మొదలైన ఇతర లక్షణాలు.
(7) వృద్ధాప్య ఛాయలు (Premature Ageing): వయసు పెరుగుతున్నప్పుడు ఏర్పడే ముడతలు సాధారణం. కానీ రోజంతా స్క్రీన్ (ఫోన్ / లాప్ టాప్) వాడుతుండటం వల్ల శరీర పొరల కింద అకాల ముడతలు ఏర్పడి, అవి మందపాటి గీతలుగా ముఖంపై ప్రతిబింబిస్తాయి
(8) ఊబకాయం (Obesity): చిరుతిళ్ళు, వ్యాయామం లేకపోవడం, రోజులో ఎక్కువ సమయం పని చేస్తూ ఉండడం వల్ల కాలక్రమేణా శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోతుంది. రిమోట్ వర్క్ (Remote Work) చేస్తున్న వ్యక్తులు ఎక్కువ శాతం అధిక బరువు తో ఇబ్బందులు పడుతున్నారు
(9) నిస్తేజంగా చర్మం (Dull Skin): నిరంతరం స్క్రీన్ (ఫోన్ / లాప్ టాప్) కి అతుక్కుని ఇంట్లోనే ఉండడం వల్ల, సూర్యరశ్మి తగలక పోవడం వల్ల, విటమిన్ డి మరియు బి12 లోపిస్తాయి. ఆ విటమిన్స్ లోపం వల్ల చర్మం నిస్తేజం మరియు ప్రకాశం హీనంగా కనిపిస్తుంది. కొందరిలో పోషకాహార లోపం కూడా గమనించవచ్చు.
(10) ఒత్తిడి (Stress): జీవితం లో ఎక్కువ సమయం సరైన మానవ సంబంధాలు లేకపోవడంతో ఒత్తిడి పెరిగి అది రక్తపు పోటు గా రూపాంతరం చెందుతుంది. ఈ రక్తపు పోటు శారీరక ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాన్ని కలిగించడమే కాక హృదయ సంబంధ వ్యాధులను ప్రోత్సహిస్తుంది.
అమెరికా కు చెందిన Job discovery platform, Directly Apply కంపెనీ వారు 25 సంవత్సరాల తరువాత సగటు WFH ఉద్యోగి ఎలా ఉంటారో AI సహాయంతో సహాయంతో రూపొందించిన చిత్రం! (Images of working from home)
ఈ ప్రతికూల ప్రభావాలు (work from home warning for WFH) తెలుసుకున్నారు కదా. వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా తెలుసుకోండి మరి! (Top Remote Working Tips for Maintaining Mental and Physical Health)
(1) స్థిరమైన దినచర్య (Routine): రిమోట్ వర్క్ చేసేటప్పుడు మీ జీవితం, మీ అభిరుచులు, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక స్థిరమైన దినచర్యను కట్టుబడి ఉండడం అవసరం. ఇంటి నుండి పని చేసే పరిమితులలో మీకు ఎక్కువ సంతృప్తిని కలిగించేది ఏమిటో మీరే ప్రశ్నించుకోండి. మీరు మార్చాలనుకుంటున్న అంశం ఏదైనా ఉంటే, మీరు దానిని ఎలా అమలు చేయవచ్చో చూడండి. Ex : ఉదయం 5.30 కి లేవండి. కాలకృత్యాలు తీర్చుకుని మార్నింగ్ వాక్ చేయండి. ఎందుకంటే ఆ సమయంలో సూర్యరశ్మి తగిలి శరీరానికి కావలసిన విటమిన్ డి మరియు బి-12 లభిస్తాయి. 8 గంటలకు అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) తీసుకోండి. ఈ రకంగా రోజంతా మీ ఉద్యోగ విధులను అనుసరించి ఒక దినచర్య అనుసరించండి.
(2) సామాజిక సంబంధాలను పెంపొందించుకోండి (Nurture social connections): రిమోట్ వర్క్ వల్ల మీరు కోల్పోయిన గొప్ప అంశం ముఖాముఖి మావన సంబంధాలు. ఎక్కువ కాలం పాటు సహజ మానవ సంబంధాలకు దూరంగా ఉండటం మీ ఒత్తిడి స్థాయిని పెంచి రక్తపోటుని కలిగిస్తుంది మరియు శారీరక ఆరోగ్యం పై హానికరమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. భౌతికంగా కార్యాలయం లో పని చేస్తున్నప్పుడు జరిగే చిన్న చిన్న సరదాలు మరియు సంభాషణల వల్ల సానుకూల ఫలితాలను ఇస్తాయి. కానీ రిమోట్ వర్క్ వల్ల మీరు వ్యక్తిగతంగా కలవలేక పోతున్నాను అన్న ఆలోచన వదిలేసి కొలీగ్స్ తో కొద్ది సేపు గడపడానికి అవకాశాలను నిర్మించుకోండి. ఆ గడిపే సమయం మీకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది.
(3) వ్యాయామం (Exercise): ఉదయం లేదా మీ షిఫ్ట్ సమయం అనుసరించి సాయంత్రం లేదా షిఫ్ట్ టైం అయ్యేదాకా స్క్రీన్ (ఫోన్ / లాప్ టాప్) ముందు కూర్చుని ఉంటే, శారీరక శ్రమకు అవకాశం ఉండదు. ఆ అవకాశం ఉండక పోవడం వల్ల మీకు స్వచ్ఛమైన గాలి దొరకదు. వ్యాయామానికి అదే సమయంలో స్వచ్ఛమైన గాలి పొందడానికి సమయాన్ని వెచ్చించండి. టెక్ నెక్ (Tech Neck) ప్రభావానికి మీరు గురికాకూడదు అనుకుంటే, యోగా (YOGA) ఒక చక్కటి పరిష్కార మార్గం.
(4) వృత్తి జీవితం – వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత (Work Life Balance): మీకు మీరు సమయాన్ని కేటాయించుకోండి. వీలైతే ఒక ప్రత్యేక గదిలో పని చేయండి లేకపోతే మీరు కూర్చునే డెస్క్ చుట్టూ కొన్ని మొక్కలు పెంచండి లేదా మంచి చిత్రాలను ఉపయోగించండి. క్రమం తప్పకుండా 10-15 నిమిషాల కాలం ఉండేలా విరామాలు తీసుకోండి. ఆ విరామ సమయంలో మంచి నీళ్లు తాగండి మరియు ఏదైనా పౌష్టికాహారం తీసుకోండి. ఉద్యోగ వేళలు అయిపోయాక, మీ వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇవ్వండి.
(5) మీ ఖాళీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి (Let your free hours blossom): ప్రయాణించాల్సిన అవసరం లేకపోవడం [వ్యక్తిగత వాహనం లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించడం ద్వారా] ఒకే ఒక్క ప్రయోజనం రిమోట్ వర్క్ వల్ల. ఇలా ఆదా అయ్యే సమయాన్ని ప్రతి రోజూ మీకు నచ్చిన ఒక క్రొత్త కోర్స్ నేర్చుకోవడానికి ఉపయోగించండి లేదా మీరు ఇష్టపడే ఫిట్ నెస్ (యోగా / జిమ్ / వాకింగ్ / స్విమ్మింగ్) కోసం వాడండి. వారంలో ఒకసారి స్నేహితులతో గడపండి. ఆ విధంగా చేయడం వల్ల మీరు మానసికంగా బలంగా ఉంటారు మరియు మీ పనితీరు మెరుగుపడుతుంది.
(6) సహాయ సహకారాలు (More collaboration): రిమోట్ గా పని చేయడం అంటే “ఒంటరి” గా పని చేయడం కాదు. తాను పని చేస్తూ, బృందం తో కలిసి పనిచేయడానికి తగిన కృషి చేస్తే, తమ జట్టుతో వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడి సహాయ సహకారాలు మెరుగుపడతాయి. వారంలో ఒక రోజు సమావేశం పేరు “సిప్ & స్ట్రెచ్” అంటే కాఫీ/టీ/కూల్ డ్రింక్ తాగుతూ సరదాగా కాసేపు గడపడం. ఈ విధమైన ఉదయాలు / సాయంత్రాలు మన మానసిక స్థితి (మూడ్) ని పెరుగుపరుస్తాయి.
రిమోట్ వర్క్ (Remote Work) వల్ల కలిగే దుష్పరిమాణాలు (what are the effects of working from home), వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి తగిన సలహాలు / సూచనలు ఆచరణలో పెట్టండి. మీ శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోండి!