జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు (Article 370 Verdict) ప్రక్రియ సరైనదే…భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం!
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న యుద్ధ వాతావరణం వల్ల తాత్కాలికంగా అమలు పరిచిన ఆర్టికల్ 370 ని 2019 వ సంవత్సరం లో శ్రీ నరేంద్ర మోడీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. భారత పార్లమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది.
ఆ నిర్ణయం పై జరిగిన న్యాయ పోరాటం లో ఈ రోజు భారత సర్వోన్నత న్యాయస్థానం “ఆర్టికల్ 370 రద్దుపై పార్లమెంటు నిర్ణయమే ఫైనల్” అని కీలక తీర్పు వెలువరించింది. భారత రాజ్యాంగం ప్రకారం జమ్మూ కాశ్మీర్ అన్ని రాష్ట్రాల లాంటిదే . రాజ్యాంగం లోని ప్రతీ నిబంధనను అమలుచేయడానికి ప్రభుత్వ సమ్మతి అవసరం లేదు అని సీజేఐ తన తీర్పులో అన్నారు. సెప్టెంబర్ 2024 లోపు ఈ రాష్ట్రం లో ఎన్నికలు నిర్వహించాలి అని కోర్టు ఆదేశించింది.
ఈ తీర్పుపై అనేక ప్రముఖులు ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలని పంచుకున్నారు. ఆ అభిప్రాయాలు మీ కోసం ఈ క్రింద ఇవ్వబడ్డాయి.